పవన్ నటించిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు ఏడేళ్లు...Pawan Kalyan.jpg
2020-09-29 07:50:23

టాలీవుడ్ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ సినిమా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అయితే పవర్ స్టార్ నటించిన కొన్ని సినిమాలు ఆయన రేంజ్ ను మరింత పెంచేశాయి. పవన్ ఇమేజ్ ను పెంచిన సినిమాల్లో అత్తారింటికి దారేది సినిమా కూడా ఒకటి పవర్ స్టార్ హీరోగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికిదారేది సినిమా వచ్చి నేటికి ఏడేళ్లు పూర్తయ్యింది.

ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా పవన్ కి మరదలు గా నటించింది. ఇక ఈ సినిమా ఫ్యామిలీ, మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. సినిమాకి కామెడీ మరో ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్ లో నుండి వెళ్లలేదంటే సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఇక పవన్ మరోసారి అత్తారింటికిదారేది లాంటి సినిమాతో రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

More Related Stories