మహానుబావుడికి మూడేళ్లు mahanubhavudu
2020-09-29 23:27:59

శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు సినిమా వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. సినిమా వచ్చి మూడేళ్లు పూర్తయ్యిన సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మహానుబావుడిని గుర్తుచేసుకుంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. మహానుభావుడు వచ్చి మూడేళ్లయ్యిందని..సినిమా పెద్ద సక్సెస్ అవ్వడంతో కృషిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించారు. కూల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది. సినిమాలో శర్వానంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో శర్వా ఎక్కువ శుభ్రత పాటించడంతో పడ్డ ఇబ్బందులు కామెడీ పుట్టించేలా ఉంటాయి. మరోవైపు మహానుభావుడు కు థమన్ ఇచ్చిన మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యింది.

More Related Stories