కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోయే వరుడు ఇతగాడే.. ఇదిగో వివరాలు..  Kajal Aggarwal
2020-10-05 23:57:54

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పదేళ్లుగా ఇండస్ట్రీ లోనే ఉంటూ దాదాపు 50 సినిమాలకు పైగా నటించింది ఈ చందమామ. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది కాజల్. ఈమెతో పాటు వచ్చిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో కనిపించడం లేదు. కానీ కాజల్ మాత్రం టాప్ హీరోయిన్ గానే వెలిగిపోతుంది. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2.. క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ తో పాటు మరో రెండు సినిమాలలో కూడా నటిస్తుంది కాజల్. తెలుగులో కూడా ఆచార్యలో నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల పెళ్లికి దూరంగా ఉంటున్నానని చెప్పింది కాజల్ అగర్వాల్. ఇప్పటికే ఈమె చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయిపోయింది. అయినా కూడా ఇప్పటికీ కాజల్ సినిమాలతో బిజీగా ఉంది. ఆ మధ్య అడిగినపుడు ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. 

34 ఏళ్ల కాజల్ ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోనని క్లారిటీ వచ్చేసింది. తను కచ్చితంగా బయట వాడిని పెళ్లి చేసుకుంటానని ఇండస్ట్రీలో తనకు స్నేహితులు ఉన్నా కూడా ఇక్కడ వాళ్లను చేసుకోను అంటోంది కాజల్. అన్నట్లుగానే ఇప్పుడు తనకు నచ్చిన గౌతమ్ కిచ్లు అనే బిజినె మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుంది కాజల్. చిన్నప్పటి నుంచి కూడా ఒకే స్కూల్, కాలేజ్ లో చదువుకున్నారు వీళ్లు. ఇప్పుడు కలిసి ఏడడుగులు నడవబోతున్నారు. డిసర్న్ లివింగ్ అనే కంపెనీకి సిఈఓ ఈయన. గౌతమ్ తో చాలా ఏళ్లుగా ఉన్న పరిచయాన్ని ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకొస్తుంది కాజల్. అక్టోబర్ చివర్లో కానీ లేదంటే నవంబర్ మొదట్లో కానీ వీళ్ల పెళ్లి జరగబోతుంది. 

More Related Stories