మనవరాలి టాలెంట్ కి మురిసిపోయిన చిరు Chiranjeevi
2020-10-09 13:05:04

సోషల్ మెడియాలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి మెగాస్టార్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు ఆయన తన కుటుంబ సభ్యుల తో పంచుకున్న సందర్భాలు కొన్ని సన్నివేశాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇదివరకు చిరు తన తల్లికి దోసెలు చేసి పెడుతూ ఓ వీడియోను పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చిరు తన మనవరాలి వీడియో పోస్ట్ చేసి తల్లి తండ్రులు ఓ మెసేజ్ ఇచ్చారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూతురు సంహిత రుద్రమదేవి సినిమాలోని ఓ డైలాగ్ తో అధరగొట్టింది. కాగా ఆ వీడియోను పోస్ట్ చేసిన చిరు "1990 లో సుస్మిత 2020లో సంహిత పరంపర కొనసాగుతుంది. అచ్చం తల్లి లానే పిల్ల "అంటూ పోస్ట్ చేసి సంతోషపడ్డారు. 

అంతే కాకుండా చిన్నారుల అభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారిలో అది ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అంటూ మెసేజ్ ఇచ్చారు. ఇక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు మనవరాలి టాలెంట్ చూసి మెగా అభిమానులు సైతం మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ లకు హాజరు కాకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టిన తరవాత ఆయన లూసిఫర్ రీమేక్, ఆచార్య, వేదళం రీమేక్ లో నటించనున్నారు.

More Related Stories