హీరో సత్యదేవ్ అరెస్ట్ Satyadev
2020-10-09 20:56:05

జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల సత్యదేవ్ హీరోగా వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక లాక్ డౌన్ కాలంలోనూ సత్య దేవ్ ఓటీటీ లో వెబ్ సిరీస్ లు తీస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండస్ర్టీలో తాను ఎదురుకొన్న కష్టాలు..పడిన శ్రమల గురించి తెలిపాడు. ఈ సందర్భంగా ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ఆప్గానిస్థాన్ వెళ్ళినప్పుడు తనను పోలీసులు అరెస్ట్ చేసారని చెప్పుకొచ్చాడు. ఆప్గానిస్థాన్ వీధుల్లో అటు ఇటు చూస్తూ నడుస్తుంటే..చూసిన పోలీసులు సూసైడ్ బాంబర్ అనుకుని అరెస్ట్ చేశాడని పేర్కొన్నాడు. హిందూస్థాన్ వ్యక్తిని అని ఎంత చెప్పినా వాళ్లకు భాష రాకనో ఎందుకో కానీ పట్టించుకోకుండా అరెస్ట్ చేశారని అన్నాడు. తరవాత చిత్ర యూనిట్ కు చెందిన వారు వచ్చి చెప్పడం తో అసలు విషయం తెలుసుకుని విడిచిపెట్టారని పేర్కొన్నాడు. అంతే కాకుండా 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఆఫర్ తనకే వచ్చిందని కానీ కొన్ని కారణాల వల్ల ప్రదీప్ చేస్తుందని వెల్లడించాడు.

More Related Stories