బాలయ్యకు అన్యాయం జరుగుతుందా.. అమితాబ్ ఎందుకిలా చేస్తున్నాడు..Amitabh Bachchan
2020-10-10 16:14:48

బాలయ్యకు నిజంగానే అన్యాయం జరుగుతుందని బాగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. అంతగా ఏం జరిగింది అనుకుంటున్నారా..? అమితాబ్ బచ్చన్ కు బాలయ్యకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఇక్కడే జరిగింది అసలు ఇష్యూ. తాజాగా అమితాబ్ బచ్చన్ ఒప్పుకున్న ఓ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తుంది. ప్రభాస్ సినిమాలో బిగ్ బి నటించడానికి ఒప్పుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా వస్తుంది. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ అతీత శక్తులున్న వ్యక్తిగా నటించబోతున్నాడు. దేవకన్యకు, మనిషికి పుట్టిన పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ కారెక్టర్ కోసం తనను తాను బాగానే సిద్ధం అవుతున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే సైరాలో అతిథి పాత్రలో నటించాడు అమితాబ్. ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. అయితే ఇక్కడే బాలయ్య అభిమానులకు మండి పోతుంది. దానికి కారణం అప్పట్లో రైతు సినిమా కోసం కృష్ణవంశీ అడిగితే నో చెప్పాడు బిగ్ బి. కానీ బాలయ్యను కాదని మిగిలిన హీరోలకు ఓకే చెప్పడంతో వాళ్లకు కాలిపోతుంది. 

More Related Stories