నాగబాబుకు శ్రీరెడ్డి వార్నింగ్.. ఆటల్లా ఉందాSri Reddy
2020-10-11 16:57:29

జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం బొమ్మ అదిరింది కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ కామెడీ షోలో ఇటీవల నటులు రియాజ్, హరి ఓ స్కిట్ చేసారు. స్కిట్ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసినట్టు ఉండటంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. దాంతో హరి, రియాజ్ లు క్షమాపణలు చెప్పారు. అయితే నాగబాబు మాత్రం బొమ్మ అదిరింది అంటూ సోషల్ మీడియాలో సింహాసనం పై ఉన్న కుక్క ఫోటోను పోస్ట్ చేసాడు. దాంతో అగ్గి మీద ఆజ్యం పోసినట్టయింది. సోషల్ మీడియాలో నాగబాబు పై జగన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ ఘటనపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందిస్తూ నాగబాబు ను బండ బూతులు తిట్టేసింది. వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ..."ఒరేయ్ స్నేక్ బాబు కనకపు సింహాసనం పై కుక్కను కూర్చోబెట్టకూడదు.నిన్ను జబర్దస్త్ షోలో జడ్జిగా కూర్చోబెట్టినందుకు మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గర విశ్వాసం కూడా చూపించలేదు. నిన్ను సింహాసనం ఎక్కించిన ఆయన్ని కటేశావు. మీ అన్న చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి జగన్ గారిని కలుస్తాడు. కానీ బాలు గారు చనిపోతే మాత్రం చూడటానికి రారు. ఇక మీ తమ్ముడేమో నువ్వు కూసే కూతలకు..నీకు పార్టీకి సంబంధం లేదని చెప్పేసాడు. నిన్ను ఎంపీ టికెట్ ఇచ్చి నిలబెట్టినా గెలవలేకపోయావ్. దాంతో నీ మైండ్ దొబ్బి పిచ్చి చేష్టలు చేస్తున్నావ్. అంతమంది ఆంధ్ర ప్రజలు ఓట్లు వేసి జగన్ ను గెలిపిస్తే ఆటల్లా ఉందా నీకు..ముందు విగ్ తీసి మాట్లాడు ఇదే నీకు ఫైనల్ వార్నింగ్" అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది.

More Related Stories