మెహబూబ్ ను బిగ్ బాస్ అందుకే సేవ్ చేశాడాMehboob
2020-10-14 15:48:49

బిగ్ బాస్ తెలుగు సీజన్-4 సక్సెస్ ఫుల్ రేటింగ్ తో కొనసాగుతుంది. ఇప్పటివరకు నాలుగు వారాలు పూర్తయ్యాయి. దాంతో హౌస్ నుండి నలుగురు సభ్యులు ఎలిమినెట్ అయ్యారు. నిన్న జరిగిన ఎలిమినేషన్ లో జోర్ధార్ సుజాత ఎలిమినేట్ అయ్యింది. అంతే కాకుండా గతవారం గంగవ్వ కు అనారోగ్యం ఉండటంతో ఆమె ఇంటికి వెళతానని నాగార్జున ను కోరింది. దాంతో నాగార్జున గంగవ్వకు ఒంట్లో బాగాలేదని బిగ్ బాస్ కి చెప్పగా..అనారోగ్యం కారణంగా ఆమె ఇంటికి వెళ్లొచ్చని బిగ్ బాస్ అనుమతి ఇచ్చారు. గంగవ్వ కోరిక మేరకు ఇల్లు కూడా కట్టిస్తామని నాగార్జున హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మెహబూబ్ కు ఎక్కువగా 5 ఓట్లు పడ్డాయి. 

అయితే మెహబూబ్ ఈ మధ్య షో లో కొంతవరకు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. గోడవల్లో ముందు ఉంటూ రెచ్చిపోతున్నాడు. దాంతో షోకు రేటింగ్ పెరుగుతోంది. అయితే షోకు రేటింగ్ పెరుగుతోంది. కానీ జనాలు మాత్రం మెహబూబ్ ఎప్పుడు ఎలిమినేషన్ లోకి వస్తాడా అన్నట్టు చూస్తున్నారు. గత వారం మెహబూబ్ ఎలిమినేషన్స్ లో ఉన్నప్పటికీ అతడి కంటే ఎక్కువ సుజాత ను ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. ఆమె వెళ్లిపోవడంతో జనాలు ఈ వీక్ మెహబూబ్ ను పంపించేయలని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం మెహబూబ్ తో మంచి కంటెంట్ ఉందని ఆలోచించి. ఇంటి క్యాప్టెన్ అయిన సోహెల్ కు నామినేట్ అయ్యిన వారిలో ఒకరిని రక్షించే పవర్ ఇస్తున్నా అని అన్నారు. సోహెల్ మరియు మెహబూన్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి సోహెల్ మెహబూబ్ ను సేవ్ చేస్తాడని అనుకున్నాడు. బిగ్ బాస్ ఊహించినట్టుగానే సోహెల్ తన ఫ్రెండ్ మెహబూబ్ ను సేవ్ చేసాడు.

More Related Stories