మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్ విడుదల.. పెళ్లి గురించి అఖిల్ తిప్పలు..Most Eligible Bachelor
2020-10-19 10:18:55

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఈ సినిమా విడుదల అయి ఉండేది. కానీ వైరస్ వచ్చి అన్నింటికీ బ్రేకులు వేసింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మధ్య షూటింగ్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. అన్నీ కుదిరితే ఇదే ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. దాంతో ప్రమోషన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అక్టోబర్ 25న టీజర్ విడుదల కానుంది. ఇందులో హర్ష అనే పాత్రలో నటిస్తున్నాడు అఖిల్. ప్రతి అబ్బాయి లైఫ్ లో 50% పెళ్లి 50 శాతం కెరీర్ ఉంటుంది. అందరి కెరీర్ బాగానే ఉంటుంది.. కానీ మిగిలిన 50 శాతం పెళ్లి విషయంలో మాత్రమే అందరికీ కంగారు ఉంటుంది అంటూ అతను చెప్పిన డైలాగ్ బాగానే పేలింది. ఈ సినిమాను పూర్తిగా పెళ్లి నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నాడు భాస్కర్. బొమ్మరిల్లు సినిమా తర్వాత ఇప్పటివరకు మరో విజయం లేదు ఈ దర్శకుడికి. పరుగు సినిమా పర్లేదు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. దాంతో ఈ దర్శకుడి కెరీర్ ఎప్పుడు అఖిల్ సినిమా పైనే ఆధారపడి ఉంది. మరో వైపు చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో అఖిల్ ఆశలు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే ఉన్నాయి. 

More Related Stories