టక్ జగదీష్ కు బ్రేకుల్లేవ్ Tuck Jagadish
2020-10-23 10:33:13

నిన్నుకోరి, మజిలీ సినిమాలతో ప్రతిభ ఉన్న దర్శకుడు అనిపించుకున్నారు శివ నిర్వాణ. ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీష్ సినిమా చేస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ను లాక్ డౌన్ తరవాత మళ్ళీ ప్రారంభించారు. అయితే సెట్ లో ఓ టెక్నిషియన్ కు కరోనా రావడంతో షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడుతుందా అని అనుమానం వచ్చింది. అయితే షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను కొనసాగితున్నామని పేర్కొంది. టెక్నీషియన్ కు కరోనా రావడంతో అతడిని కాంటాక్ట్ అయిన వారికి టెస్టులు నిర్వహించినట్టు తెలుస్తోంది.

తాజాగా టక్ జగదీష్ టీమ్ షూటింగ్ స్పాట్ లో స్ప్రే చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా చిత్రాన్ని సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టక్ జగదీష్ క్లీన్ ఎంటర్ టైనర్. ఇందులో నాని ఫుల్లు జోష్ గా కనిపిస్తారు. ఫుల్లుగా నవ్విస్తాడని క్లారిటీ ఇచ్చారు. శివ నిర్వాణ సినిమాల్లో ఎమోషన్స్ బలంగా ఉంటాయి. ఆయన గత సినిమాలు నిన్నుకోరి, మజిలీ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. టక్ జగదీశ్ కూడా ఈ కోవలోనే ఉండబోతుంది.

More Related Stories