చార్మీ తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్  Actress Charmi
2020-10-27 01:21:47

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. చర్యలు తీసుకున్నప్పటికి కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నటి చార్మీ తల్లి తండ్రులు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు చార్మీ ఓ ట్వీట్ చేసింది. దసరా శుభాకాంక్షలు చెబుతూ చార్మీ తన తల్లి తండ్రులు కరోనా బారిన పడ్డారని పేర్కొంది. "అక్టోబర్ 22 న నా తల్లితండ్రులు కరోనా బారిన పడ్డారు. మార్చ్ నెల నుండి లాక్ డౌన్ మొదలైన నాటి నుండి మా తల్లిదండ్రులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించారు. వారు ప్రస్తుతం మా ఇంట్లోనే హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా జాగ్రత్తలు పాటించినప్పటికి కరోనా బారిన పడ్డారు. ఎప్పటినుండో మా నాన్న ఆరోగ్య పరిస్థితి తెలిసిన నాకు ఆయన కరోనా బారిన పడ్డారని  వినగానే టెన్షన్ అయింది. వెంటనే చికిత్స నిమ్మితం వారు హైదరాబాద్ లోని ఎఐజి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెప్పారు. మీలో ఎవరికైనా కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. కరోనాను ముందుగానే గుర్తిస్తే నిర్మూలించడం చాలా సులభం అవుతుంది. దుర్గామాత ఈ దసరాకి కరోనా రాక్షసిని అంతం చేయాలని కోరుకుందాం. మా తల్లితండ్రుల ఆరోగ్యం కొరకు అందరూ దయచేసి ప్రార్థించండి." అంటూ చార్మీ ట్వీట్ చేశారు.

More Related Stories