జేమ్స్ బాండ్ నటుడు ఇకలేరు Sean Connery
2020-11-01 10:56:23

హాలీవుడ్ నటుడు జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరి (90) కన్నుమూశారు. సీన్ కానరి నిద్రలోనే మరణించినట్టు యూకే కి చెందిన మీడియా వెల్లడించింది. 1962లో "డాక్టర్ నో " సినిమాలో నటించిన సీన్ కానరీ ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించి అలరించాడు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు జేమ్స్ బాండ్ సినిమాలంటే ఎగబడి చూస్తారు. సినిమాలో కానరీ పేల్చిన డైలాగులు ఇప్పటికీ పేలుతూనే ఉన్నాయి. బాండ్....జేమ్స్ బాండ్" జేమ్స్ బాండ్ 007" అనే డైలాగులు ఇప్పటికీ కొన్ని సినిమాల్లో వాడటం చూస్తుంటాం. అంటే జేమ్స్ బాండ్ క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి సినిమాలో నటించిన కానరీ సినిమా బ్రతికి ఉన్నంత కాలం బ్రతికి ఉండటం కాయం. కానరీ జేమ్స్ బాండ్ పాత్రలో చేసిన ఛేజింగులు, ఫైట్ లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక కానరీ నటనకు ఒక ఆస్కార్ అవార్డ్ తో పాటు మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి. అంత గొప్ప నటుడి మరణంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జేమ్స్ బాండ్ కి నివాళ్ళు అర్పిస్తున్నారు.

More Related Stories