బిగ్ బాస్ లో నెపోటిజం రచ్చ..సల్మాన్ సీరియస్Salman Khan
2020-11-01 19:23:11

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెపోటిజం అనే పేరు బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. నెపోటిజం అనే వారసత్వం అని అర్థం. ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగా సుశాంత్ మంచి నటుడు అయినప్పటికీ ఆఫర్లు దక్కలేదని నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయంలో నటి కంగనా సైతం బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే ఈ మ్యాటర్ మర్చిపోతున్న సమయంలో హిందీ బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ నెపోటిజం రచ్చ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 14 గతవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా రాహుల్ వాద్య అనే కంటెస్టెంట్ జాన్ కుమార్ అనే వ్యక్తిని నామినేట్ చేసాడు. జాన్ పెద్దగా టాలెంట్ లేదని...బందు ప్రీతి వల్లనే హౌస్ లో ఉండగలుగుతున్నాడని వ్యాఖ్యానించాడు. తనకు బందుప్రీతి నచ్చదని అందుకే నామినేట్ చేస్తున్నా అని పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై తాజాగా వచ్చిన ప్రోమోలో సల్మాన్ ఖాన్ సీరియస్ అయ్యారు. ఆ విషయాన్ని హౌస్ లోకి ఎందుకు తీసుకువచ్చావ్ అంటూ మండిపడ్డాడు. దాంతో తాజా ప్రోమో వైరల్ అవుతోంది. ఇక రచ్చ ఎక్కడికి దారి తీస్తోందో చూడాలి.
 

More Related Stories