ఇండస్ట్రీకి మరో వారసుడు.. హీరోగా సుమ రాజీవ్ కనకాల కొడుకు.. Anchor Suma
2020-11-03 09:40:55

తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు ఎక్కడైనా కూడా వారసత్వం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ఒక్కరొస్తే చాలు అంతా అక్కడే కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈయన నాలుగేళ్ల కింద శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన నిర్మల కాన్వెంట్ లో నటించాడు. ఇప్పుడు సోలో హీరోగా పరిచయం అవుతున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తైపోయాయి. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే సుమ కనకాల కొడుకు కావడంతో ఆసక్తి కూడా బాగానే ఉంది. ఈమెకు హీరో అయ్యేంత కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె కొడుకు రోషన్‌కు 21 ఏళ్లు ఉన్నాయి. దాంతో హీరో అయిపోతున్నాడు. ఇప్పుడు సుమ కొడుకు ఫిజిక్ కూడా అదిరిపోయింది. ఆమెకు కూతురు కూడా ఉంది. పేరు మనస్విని.. ప్రస్తుతం చదువుతో బిజీగా ఉంది మనస్విని. మరోవైపు రోషన్ మాత్రం చదువు పూర్తి చేసుకుని హీరో అవుతున్నాడు. కొత్త దర్శకుడు విజయ్ చెప్పిన రొమాంటిక్ కథ నచ్చి కొడుకును అతడి చేతుల్లో పెట్టేసారు. ఓ కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. కచ్చితంగా తమ అబ్బాయి కూడా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొంటాడని చెప్తున్నారు సుమ దంపతులు. మరి వాళ్ల కోరికను రోషన్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.

More Related Stories