రాజకీయాల్లోకి విజయ్...పార్టీ పేరు ఇదేVijays political entry
2020-11-06 12:28:50

తమిళ రాజకీయాల్లోకి హీరో దళపతి విజయ్ ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన పార్టీ పేరును ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించారు. పార్టీ పేరును "ఆల్ ఇండియా దళపతి విజయ్ ముక్కల్ ఇయ్యకం" అని విజయ్ రిజిస్టర్ చేయించారు. ఇంగ్లీష్ లో విజయ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ అని దాని పేరు. పార్టీకి సంబందించిన పూర్తి వివరాలను ఆయన త్వరలో ప్రకటించనున్నారు. కాగా విజయ్ పీపుల్స్ ఉద్యమంగా ఉన్న సంస్థ పేరును ఆయన పార్టీకి పెట్టారు. ఇక ఇప్పటికే తమిళ స్టార్ హీరోలు ఎందరో పార్టీలు పెట్టి సక్సెస్ అయ్యారు.  ఇటీవల పార్టీ పెట్టిన నటుడు కమల్ హాసన్ సైతం రాజకీయాల్లో చురుకుగా ఉంటూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు. అయితే విజయ్ మాత్రం మిగతా హీరోలకంటే చిన్నన్వయస్సులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నరు. ఇక విజయ్ ఏ మేరకు రాజకీయాల్లో సక్సెస్ అవుతారో చూడాలి. ఇదిలా ఉండగా ఇటీవలే విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. సినిమాల విషయానికొస్తే విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. మరి విజయ్ సినిమాలు చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతారా..లేదంటే సినిమాలకు గుడ్ బై చెబుతారా అన్నదానిపై ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

More Related Stories