మళ్ళీ హై కోర్టుకు చేరిన దిశ ఎన్ కౌంటర్ చిత్రంDisha Encounter
2020-11-06 19:46:19

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా దిశ ఎన్కౌంటర్. ఈ సినిమాను వర్మ హైదరాబాద్ లో జరిగిన యాథార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించారు. సినిమాను ఈనెల 26 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా విడుదలకు నిలిపివేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి సినిమా విడుదలకు నిలిపి వేయాలంటూ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాను నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. 

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నారని వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీధర్ రెడ్డి పిటిషన్ పై నేడు మరోసారి హైకోర్టులో విచారించనున్నారు.  ఈ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ మరో సినిమా "మర్డర్" కు కూడా కోర్టులో బ్రేక్ పడింది. మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రణయ్ తండ్రి కోర్ట్ లో పిటిషన్ వేయడంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా బ్రేక్ పడటంతో వర్మకు పెద్ద షాకే తగిలింది. ఇకనైనా వర్మ వివాదాల సినిమాలు కాకుండా మంచి కథలతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More Related Stories