మెగాస్టార్ కు కరోనా పాజిటివ్Megastar Chiranjeevi
2020-11-09 18:49:22

దేశంలో కరోనా విజృంభన తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. చలి కాలం కావడంతో వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇది సెకండ్ వేవ్ అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండోసారి కరోనా వస్తే అది ప్రమాదకరమని చెబుతున్నారు. ఇక సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే హీరో రాజశేఖర్ కరోనాతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కరోనా భారిన పడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్ కోసం ముందు జాగ్రత్తగా టెస్ట్ చేసుకోగా చిరంజీవికి పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. "ఆచార్య సినిమా షూటింగ్  కోసం కరోనా టెస్ట్ చేయించుకున్నా. రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నన్ను కలిసిన వాళ్ళందరూ టెస్ట్ చేయించుకోగలరు. నా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ మీకు తెలియజేస్తాను" అంటూ చిరు ట్వీట్ లో పేర్కొన్నారు. మెగాస్టార్ కు కరోనా రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండురోజుల క్రితమే మెగాస్టార్, నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడం ఆందోళన కలిగిస్తోంది. వరద బాధితుల సహాయార్థం చిరు కేసీఆర్ ను కలిసి చెక్ అందజేశారు.

More Related Stories