అవినాష్ నువ్వు బతికుండు..అరియానా ఎమోషనల్ Ariyana
2020-11-09 13:57:15

బిగ్ బాస్ సీజన్-4 రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గోడవలతో రోజురోజుకు హీటు పెరుగుతోంది. మిగతా రోజులకంటే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ, మరియు ఎలిమినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ మరింత ఆసక్తిగా సాగింది. నామినేషన్ లో ఉన్నవాళ్లు అంత సేవ్ అవ్వగా చివరికి అమ్మా, అవినాష్ లు మిగిలారు. దాంతో ఇద్దరిని నాగార్జున గార్డెన్ ఏరియాలో ఉన్న బాత్ రూమ్ లోకి వెల్లమన్నారు. అయితే వాళ్ళు వెళ్లేముందు పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. అవినాష్ వెళ్లిపోతాడేమో అని భావించిన అరియానా అతడి దగ్గరకు వచ్చి బోరున ఏడ్చేసింది. ఒకవేళ అటూ ఇటూ అయితే వెయిట్ చేయవా. నేను భయటకు రాగానే నిన్ను కలుస్తాను. నీ ప్రాబ్లమ్స్ గురించి నువ్వు ఆలోచించకు..ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే డిసిషన్ తీసుకోకు అవినాష్. ఏమి చేస్కోనని ప్రామిస్ చెయ్..నువ్వు బతికుండు అవినాష్ ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా అంటూ అరియానా ఎమోషనల్ అయింది.

 తరవాత అవినాష్ సేఫ్ కాగా అమ్మరాజశేకర్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వెళ్ళాడు. అవినాష్ సేఫ్ అయ్యాక కూడా చాలాసేపు ఏడ్చేశాడు. తాను జీరో స్టేజ్ లో ఉండగా బిగ్ బాస్ హౌస్ తో మళ్ళీ లైఫ్ వచ్చిందన్నారు. అవినాష్ ఇప్పటికే ఒకసారి ఈఎంఐ లు కట్టలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అరియానా అవినాష్ మళ్ళీ ఏమైనా చేసుకుంటాడా అని అతడితో ప్రామిస్ చేసుకుంది. ఇక అమ్మా ఎలిమినేషన్ తో ఇప్పటివరకు హౌస్ నుండి 9మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.

More Related Stories