టీఆర్పీ కోసం బిగ్ బాస్ కష్టాలు..హౌస్ లోకి మరో హీరోNaga Chaitanya
2020-11-13 19:06:48

బిగ్ బాస్ సీజన్4 కు టిఆర్పీ భారీగా తగ్గిపోవడంతో నిర్వాహకులు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో హోస్ట్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లడంతో నాగ్ కోడలు సమంత తో హోస్టింగ్ చేయించారు. అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ కి అఖిల్ ని రప్పించి సందడి చేయించారు. అదే రోజు హౌస్ కి హైపర్ ఆది కూడా వచ్చి పంచుల వర్షం కురిపించారు. ఇక ఆతరవత మొన్నటివారం సుమ కనకాల వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ జనాలను ఫూల్స్ ని చేసే ప్రయత్నం చేశారు. అయితే బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 3 లకు కూడా సుమా కనకాల వచ్చి వెళ్లిన విషయం ప్రేక్షకులు గుర్తించడంతో బిగ్ బాసే పెద్ద ఫూల్ అయ్యాడు.

 కాగా సుమ వచ్చిన ఎపిసోడ్ లో షోకి మంచి రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు మరో ప్లాన్ వేశారు. ఈ వారం హౌస్ లోకి నాగ చైతన్య ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. చైతూ ప్రస్తుతం "లవ్ స్టొరీ" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. సాయి పల్లవి ఈ సినిమాలో చైతూతో రొమాన్స్ చేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే చైతూ హౌస్ లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగార్జున తన కుమారుల సినిమాలను బాగానే ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ..బిగ్ బాస్ రేటింగ్ ను కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారని బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

More Related Stories