సుమతో గొడవలు..క్లారిటీ ఇచ్చిన రాజీవ్Anchor Suma
2020-11-14 19:07:50

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ సుమ కనకాల కు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. సుమ మదర్ టంగ్ తెలుగు కాకపోయినా అచ్చమైన తెలుగుతో ప్రేక్షకుల మదిని దోచేసింది. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్లు చేయడంలో సుమకు ఎవరూ పోటీ కారనే చెప్పాలి. స్టార్ మహిళ టీవి ప్రోగ్రామ్ తో సుమ అత్యధిక ఎపిసోడ్స్ యాంకరింగ్ చేసి ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా సుమ తన భర్త రాజీవ్ కనకాల మధ్య గొడవలు ఉన్నాయంటూ...వారు విడాకులు కూడా తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా రాజీవ్ ఉంటున్న ఇల్లును సైతం సుమ అమ్మకానికి పెట్టిందంటూ పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల కొడుకు సినిమా పూజ కార్యక్రమంలో సుమ-రాజీవ్ జంటగా పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు. తాము కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పారు. 

ఇక తాజాగా సుమతో ఉన్న గోడలపై రాజీవ్ కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అన్ని కుటుంబాల్లో అన్నట్టుగానే తమ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయని అన్నాడు. అంతే తప్ప విడకులవరకు వెళ్లలేదని చెప్పాడు. భార్య భర్తలు అన్నాక గొడవలు కామన్ అని కానీ సుమ-రాజీవ్ మధ్య గొడవలు అంటే జనాలకు పెద్దగా కనిపించిందని పేర్కొన్నాడు. కొందరైతే విడాకులు తీసుకున్నారు అని రాసారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాము చాలా సంతోషంగా ఉన్నామని రాజీవ్ క్లారిటీ ఇచ్చాడు. తమ కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాడు.

More Related Stories