దీపావళి స్పెషల్...కళాతపస్విని కలిసిన మెగాస్టార్ Megastar Chiranjeevi
2020-11-15 02:07:00

మెగాస్టార్ చిరంజీవి దీపావళి పండుగ సందర్భంగా సతీసమేతంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ నివాసానికి వెళ్లారు. అంతేకాకుండా చిరంజీవి దంపతులు పట్టు వస్త్రాలను విశ్వనాథ్ దంపతులకు బహూకరించారు. అనంతరం చిరు విశ్వనాథ్ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో హీట్ సినిమాలు అందించిన తన గురువు విశ్వనాథ్ తో చిరు కాసేపు సరదాగా గడిపారు. అప్పటి సినివిశేషాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కాగా చిరు తన గురువుగారి పాదాలకు నమస్కరించడంతో ఆయన ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. ఈ సంధర్భంగా చిరు గురువుగారిని కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "అందరికి దీపావళి శుభాకాంక్షలు!పండగ అంటే మన ఆత్మీయులని కలవటం,ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం..అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన,నాకు గురువు మార్గదర్శి,ఆత్మబంధువు కే.విశ్వనాధ్ గారిని కలిసి,ఆ దంపతులని సత్కరించుకున్నాను.వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది" అంటూ చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

More Related Stories