పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన త్రిష..జీవితాంతం ఇలానేTrisha Simbu
2020-11-18 07:47:54

ఇరవై ఏళ్లుగా దక్షిణాది సినిమాల్లో రానిస్తున్న హీరోయిన్ త్రిష. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తన అందం, నటనతో త్రిష ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. మొదట్లో ఈ భామ చక చక సినిమాలు చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం సెలక్టివ్ పాత్రల్లోనే నటిస్తోంది. తెలుగులో టాప్ హీరోలు అందరి సరసన ఈ భామ నటించింది. అతడు సినిమాతో త్రిషకు మరింత క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉండగా త్రిష గత కొంతకాలంగా తమిళ నటుడు శింబు తో ప్రేమలో ఉందని వార్తలు వస్తూన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో త్రిష ఆ వార్తలను కండించింది. 

ప్రేమ, పెళ్లి పై తన మనసులో మాటను భయట పెట్టింది. భవిష్యత్తు లో తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని పేర్కొంది. తనను సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం ఎదురుచూస్తున్నానని అలాంటి వ్యక్తి దొరకగానే పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. ఒకవేళ అలాంటి వ్యక్తి కనిపించకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా అంటూ సంచలన వ్యాక్యాలు చేసింది. ఇదిలా ఉండగా త్రిష ఇటీవల నటించిన "96" సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో త్రిష నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ భామ ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో "పొన్నియన్" అనే సినిమాలో నటిస్తోంది.

More Related Stories