ఆకాశమే నీ హద్దురా సినిమాపై సూపర్ స్టార్ ప్రశంసల జల్లుMahesh Babu
2020-11-19 13:52:32

తమిళ స్టార్ హీరో సూర్య చాలా కాలం తరవాత "ఆకాశమే నీ హద్దురా" సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు."శూరరై పోట్ర" పేరుతో ఈ సినిమాను తమిళ్ లో తెరకెక్కించారు. కాగా తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఎయిర్ డెక్కన్ అధినేత జిఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా సెలబ్రెటీలను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. 

ఇప్పటికే ఈ సినిమాపై వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, మాధవన్, విజయ్ దేవురకొండలు ప్రశంసలు కురిపించారు. కాగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దుబాయ్ టూర్ తరవాత ఇంటికి వచ్చిన మహేష్ బాబు తాజాగా ట్వీట్ చేశారు. "శూరరై పోట్రూ..ఆకాశమే నీ హద్దురా సినిమా స్ఫూర్తిదాయక చిత్రం. డైరెక్షన్ తీరు, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. సూర్య నటన సూపర్. చిత్ర బృందానికి నా అభినందనలు" అంటూ మహేష్ ట్వీట్ చేశారు. దాంతో సూర్య కూడా మహేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
 

More Related Stories