గ్రేటర్ ఎన్నికలు..టాలీవుడ్ కి సీఎం కేసీఆర్ వరాలుTRS GHMC Election
2020-11-23 22:24:37

తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సినిమావాళ్లకు భారీగా వరాలు ప్రకటించారు. కరోనా క్రైసిస్ వల్ల 40వేల మంది సినీకార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం. అలాగే వీరందరికీ రేషన్ కార్డులు.. హెల్త్ కార్డులు ఇస్తామని ప్రామిస్ చేశారు. చిన్న సినిమాలపై వేలాది మంది కార్మికులు.. జూనియర్ ఆర్టిస్టులు ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు జీఎస్టీని మినహాయిస్తున్నాం. మార్చి నుంచి ఇప్పటివరకూ 9 శాతం పన్ను రద్దు చేస్తున్నాం అని తెలిపారు. అలాగే థియేటర్లు తెరవక యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయని.. వారికి కనీస మెయింటెనెన్స్ చెల్లింపు అలాగే.. కరెంట్ బిల్లులు రీఇంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో టాలీవుడ్ ఇండియాకి ఫిలింహబ్ అవుతుందని కేసీఆర్ అన్నారు. త్వరలోనే సినీపెద్దలతో ఈ విషయంపై మరోసారి కలుస్తానని కూడా ప్రామిస్ చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే టాలీవుడ్ కి చాలా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. 
 

More Related Stories