చైతూ అభిమానులకు లవ్ స్టొరీ చిత్ర యూనిట్ స్పెషల్ గిఫ్ట్ Love Story
2020-11-23 17:43:41

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో అభిమానులు, నటీనటులు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య "లవ్ స్టొరీ" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో నాగచైతన్యకు జంటగా రౌడీ బేబీ సాయి పల్లవి జంటగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

 ఇక సోమవారం నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా "లవ్ స్టొరీ" పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఈ పోస్టర్ లో నాగచైతన్య విలేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. వైట్ కలర్ బనీన్.. నీలి రంగు లుంగితో కనిపిస్తున్నారు. హీరోయిన్ సాయి పల్లవి మరియు సమంత అక్కినేని లు ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నాగ చైతన్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు. సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండటంతో ఎక్కువ శాతం షూటింగ్ ను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు.

More Related Stories