వినాయక్ కు నో చెప్పిన బాలయ్యBalayya
2020-11-24 14:03:28

టాలీవుడ్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు వివి వినాయక్. టాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలు సినిమాలు చేసిన వినాయక్ ఇప్పుడు మాత్రం కాళీగా ఉంటున్నారు. చిరు వినాయక్ డైరెక్షన్ లో ఖైదీ నెం.150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా చిరు, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమా కూడా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఇదిలా ఉండగా మెగాస్టార్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ లోనూ ముందు వినాయక్ ను అనుకున్నారు. దాదాపు ఖరారైన ఈ ప్రాజెక్ట్ టెక్స్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయింది. ఇక ఎప్పటి నుండో బాలయ్య బాబుతో కూడా వినాయక్ ఓ సినిమాను తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక సరైన స్క్రిప్ట్ లేని కారణంగా బాలయ్య కూడా వినాయక్ సినిమాకు నో చెప్పినట్టు సమాచారం. చిరు, బాలయ్య లు వినాయక్ మళ్ళీ స్ట్రాంగ్ స్క్రిప్ట్ లతో రావాలని కోరుకుంటున్నారట.

More Related Stories