అఖిల్ క్యారెక్టర్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్Rahul Sipligunj
2020-11-27 12:20:50

బిగ్ బాస్ సీజన్-4 ముగింపు దశకు చేసురుకుంది. ఈ నేపథ్యంలో హౌస్ లో టాప్-5 లో వుండేది ఎవరు..ఎలిమినేట్ అయ్యేది ఎవరు..టైటిల్ విన్నర్ ఎవరు అన్న దానిపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. మరో రెండు వారాల్లో వారిలో ఇద్దరు ఎలిమినెట్ అయి మిగిలిన 5గురు టాప్-5 కి చేరుతారు. అయితే తాజాగా బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లింగజ్ బిగ్ బాస్-4 విన్నర్ పై, హౌస్ లో టాప్ కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాజాగా ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ...

ఈ సారి టాప్-5 లో మోనాల్ గజ్జర్, అవినాష్, సోహెల్, అభిజిత్, అరియనా ఉండే ఛాన్స్ ఉందని కామెంట్ చేసాడు. మరో రెండు వారాల్లో అఖిల్, హారిక లు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు. అంతే కాకుండా అఖిల్ సీక్రెట్ రూమ్ లో చేసిన కామెంట్స్ అతడికి మైనస్ అయ్యాయని చెప్పాడు. సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సీక్రెట్ రూమ్ లో తనను ఉంచి అసలు అక్కడ గేమ్ ఎలా అడతారని చేసిన కామెంట్స్ అఖిల్ కు మైనస్ అయ్యాయని చెప్పాడు. అభిజిత్ తో కూడా మేక ప్రోటీన్ తిని పులి లాగా భయటకు వచ్చిందని చేసిన కామెంట్స్ కూడా అఖిల్ కు మైనస్ అయ్యాయని అన్నాడు. 

ఇక ఈ సారి విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉందని రాహుల్ ని ప్రశ్నించగా...అభిజిత్ లేదా సోహెల్ విన్నర్ అవుతారని అరియానా కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. మీకు లాస్ట్ లో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగి విన్ అయినట్టు అఖిల్ విన్నావుతారేమో అని యాంకర్ అనగా..ఆ టైం దాటిపోయిందంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. మరోవైపు రాహుల్ తన సోషల్  మీడియాలో కూడా అభిజిత్, సోహెల్ లకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ 3 విన్నర్ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అన్నది చూడాలి.

More Related Stories