డైరెక్టర్ ని చితకబాదిన కీర్తిసురేష్..వీడియో వైరల్Keerthi Suresh
2020-12-03 15:01:31

మహానటి కీర్తి సురేష్ దర్శకుడు వెంకీ అట్లూరిని  పరిగెత్తించుకుంటూ కొట్టింది.  అసలు వెంకీ అట్లూరిని మహానటి ఎందుకు కొట్టిందో తెలుసుకోవాలంటే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.  ప్రస్తుతం కీర్తిసురేష్, నితిన్ హీరో హీరోయిన్ లుగా "రంగ్ దే" సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ సమయంలో మేము చెమటలు కారుస్తుంటే కీర్తి మాత్రం హాయిగా పడుకుందని నితిన్...కీర్తి సురేష్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

అందులో డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ఉన్నాడు. ఆ ఫోటోలపై స్పందించిన కీర్తి ఇకపై షూటింగ్ లో పడుకోకూడదు అనే గుణపాఠం నేర్చుకున్నానని..త్వరలో నితిన్ పై, వెంకీపై రివేంజ్ తీర్చుకుంటానంటూ స్పందించింది. ఈ నేపథ్యంలోనే సరదాగా వెంకీ పై పగ తీర్చుకుంది. కీర్తికి ఓ గొడుగు దొరకడంతో సరదాగా ఆ గొడుగుతో వెంకీని పరిగెత్తించుకుంటూ చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కీర్తి నితిన్ ఒక్కడు బాకీ ఉన్నాడంటూ రాసుకొచ్చింది.

More Related Stories