నువ్వెంత నీ బతుకెంత.. బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి..Sri Reddy
2020-12-05 14:23:21

కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి పేరు సోషల్ మీడియాలో వినిపించడం లేదు. ఎవరినీ ఏమీ అనకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ తన నోటికి పని చెప్పింది. తాజాగా నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది శ్రీ రెడ్డి. దానికి కారణం ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ కామెంట్స్ చేయడమే. ఈ వివాదానికి తెర తీసింది ప్రకాష్ రాజ్. అసలు విషయం ఏమిటంటే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఊసరవెల్లి అంటూ సంచలన కామెంట్ చేశారు. దాంతో నాగబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఆయనతో పాటు నిర్మాత బండ్ల గణేష్ కూడా సీరియస్ కామెంట్ చేశాడు. దాంతో ఇప్పుడు శ్రీ రెడ్డికి కోపం వచ్చింది. నువ్వెంత నీ బతుకెంత.. నువ్వు ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తావా.. అంత రేంజ్ నీకుందా అంటూ బండ్ల గణేష్ పై సీరియస్ అయింది శ్రీ రెడ్డి.

నీ సినిమాలేదో చేసుకోవచ్చు కదా.. ఓ సారి రాజకీయ సన్యాసం అంటూవు.. మరోసారి పాలిటిక్స్ గురించి మాట్లాడుతావు.. నోరు తెరిచి ఏదో వాగుతుంటావు నీ గురించి నీకే క్లారిటీ లేదు అంటూ మండిపడింది ఈ ముద్దుగుమ్మ. అనవసరంగా పిచ్చి కూతలతో వార్తల్లో ఉంటావని శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించింది. మరోవైపు నటుడు, నిర్మాత సచిన్ జోషితో గొడవలు, ఆయనతో జరిపిన మంతనాలు ఇలాంటి చీకటి బాగోతం గురించి ఎవరికి తెలియదు అంటూ బండ్ల గణేష్ ని టార్గెట్ చేసింది. 

నిజంగా నీకు ప్రకాశ్ రాజ్‌ను విమర్శించేంత స్థాయి ఉందా.. నువ్వే యాక్టర్ అయితే ఇప్పటికే గొప్ప కమెడియన్ అయి ఉండేవాడివి కదా.. కనీసం రాజకీయాలపై అవగాహన ఉంటే అలాగైనా ఎదిగేవాడివి కదా అంటూ బండ్ల గణేష్‌ను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు కార్యకర్తలు బండ బూతులు తిడుతున్నారు.. జనసేన కార్యకర్తలే ఆయనను పట్టించుకోవడం లేదు.. ఎందుకంటే ఎప్పుడూ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో తెలియదు. వాళ్లకు లేని బాధ నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ పై మండి పడింది. మీ అడ్డమైన నోరేసుకుని కంపు కూతలు ఆపండి.. ప్రకాష్ రాజ్ ను విమర్శించే స్థాయి నీకు గాని నాగబాబుకు కానీ లేదు అంటూ సీరియస్ అయింది శ్రీ రెడ్డి. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది.

More Related Stories