బెంగుళూరుకు రజినీ సీక్రెట్ విజిట్...కారణం ఇదేrajinikhanth visits bengaluru
2020-12-07 15:53:16

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దం అయిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా ఐటీ, బీటీ హబ్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. బెంగళూరు పెరిగి ఓ ఇంటి వాడైన రజనీకాంత్ తరువాత చెన్నైలో అడుగుపెట్టి ఏకంగా సూపర్ స్టార్ అయిపోయారు. రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల పక్కా క్లారిటీ ఇచ్చిన తలైవా రజనీకాంత్ బెంగళూరు చేరుకుని సొంత సోదరుడు సత్యనారాయణ ఫ్యామిలీతో పాటు ఆయన సన్నిహితులతో మంతనాలు జరిపారు. బెంగళూరు రహస్యంగా వచ్చిన తలైవా మీడియాను దూరం పెట్టడం చర్చకు దారితీసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. తమిళ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఓ వెలుగు వెలుగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత సోదరుడు సత్యనారాయణ మాత్రం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ కాక ముందు ఆయన్ను ఆయన సోదరుడు సత్యనారాయణ అన్ని రకాలుగా ఆదుకున్నారు.

డిసెంబర్ 6వ తేదీ ఆదివారం రాత్రి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు చేరుకున్నారు. అనంతరం సన్నిహితుడి కారులో రజనీకాంత్ బెంగళూరులోని ఆయన సొంత సోదరుడు సత్యనారాయణ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ విషయాలతో పాటు రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో రజనీకాంత్ ఆయన సోదరుడు సత్యనారాయణతో చర్చించారని తెలిసింది.

 కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని ట్వీట్ చేశారు. రజనీకాంత్ రంగప్రవేశంపై క్లారిటీ రావడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు సంబరాలు చేసుకుంటున్నారు. సొంత సోదరుడు సత్యనారాయణతో పాటు రజనీకాంత్ బెంగళూరులోని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో భేటీ అయ్యారు. అయితే మీడియాకు ఏమాత్రం లీక్ కాకుండా రజనీకాంత్, ఆయన సోదరుడు సత్యనారాయణ జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద సినీ రంగంలో సంచలనాలు సృష్టించిన రజనీకాంత్ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బింధువు అవుతారో వేచి చూడాలి

More Related Stories