క్రితి సనన్ కు కరోనా పాజిటివ్ Kriti Sanon
2020-12-09 20:28:36

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ను అదుపు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికి వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. తాజగా ప్రముఖ హీరోయిన్ క్రితి సనన్ కరోనా బారిన పడింది. ఈ విషాన్ని తానే స్వయంగా వెల్లడించింది. బుధవారం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని క్రితి సనన్ పేర్కొంది. కరోనా పాజిటివ్ రావడంతో ఆమె క్వారంటైన్ లోకి వెళ్ళింది.  ప్రస్తుతం తన ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని క్రితి తన పోస్ట్ లో పేర్కొంది. 

డాక్టర్ ల సలహా మేరకు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలిపింది. త్వరలోనే కరోనా ను  జయించి షూటింగ్ లో పాల్గొంటానని పేర్కొంది. కోలుకునే వరకు తనకు అందరూ చేసే విషెస్ ను చదువుతూ ఉంటానని చెప్పింది. అందరూ క్షేమంగా ఉండాలని మహమ్మారి ఇంకా పోలేదని ఫ్యాన్స్ కు క్రితి సలహా ఇచ్చింది. ఇదిలా ఉండగా క్రితి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మహేష్ బాబు సరసన నంబర్ 1, దోచేయ్ సినిమాల్లో నటించింది. రెండు సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడం తో క్రితి మళ్ళీ బాలీవుడ్ కు పయనమైంది.

More Related Stories