ప్రభాస్ తో నటించే గోల్డెన్ ఛాన్స్..ఆడిషన్స్ ఎక్కడంటేPrashanth Neel
2020-12-09 14:41:00

బాహుబలి సినిమాతో రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఈ సినిమా పూర్తవగానే  ఆదిపురుష్ సినిమాలో నటించనున్నాడు. అంతే కాకుండా నాగ్ అశ్విన్ తో కూడా ఓ సీనిమా చేయడానికి ఒకే చెప్పాడు. ఈ రెండు సినిమాలు రాధే శ్యామ్ తరవాత సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇదిలా ఉండగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి కూడా ఓకే చెప్పాడు. ఈ సినిమా టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించారు. "సలార్" అనే పేరుతో సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను హంబుల్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.

అయితే తాజాగా నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. "సలార్" సినిమాలో నటించాలనుకునే ఔత్సాహికులకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. నటన పై ఆసక్తి ఉన్నవారికి అవకాశం ఇవ్వడానికి రెడీ అయింది. ఏ భాషలో అయినా ఒక నిమిషం వీడియో ఆక్ట్ చేయాలని ప్రకటనలో  పేర్కొంది. ఆడిషన్స్ కోసం డిసెంబర్ 15న హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు రావాలని పేర్కొంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు ఆడిషన్స్ ఉంటాయని పేర్కొంది. త్వరలో బెంగుళూరు..చెన్నై లో కూడా ఆడిషన్స్ ఉంటాయని తెలిపింది. కాగా ఒకవేళ ఆడిషన్స్ లో ఎంపిక అయితే కేజీఎఫ్ లాంటి భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో...ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పొచ్చు.

More Related Stories