కొడుకును హీరోగా చూడాలనుకున్న రాజేంద్రప్రసాద్.. కానీ చివరికిRajendra Prasad
2020-12-15 22:22:33

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది తమ తండ్రులు, తాతల బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా కొంతమంది నటుల వారసులు మాత్రం బోల్తాపడ్డారు..మరి కొంతమంది తమకు ఇండస్ట్రీ సెట్ కాదని లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకున్నవారిలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమారుడు బాలాజీ ప్రసాద్ కూడా ఒకరు. అందరిలానే రాజేంద్ర ప్రసాద్ కూడా తన కుమారుడిని హీరోగా చూడాలని కలలు కన్నాడు. అంతే కాకుండా సినిమా కూడా మొదలు పెట్టారు. ఆ సినిమాకు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించగా నిధి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

 ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో బ్రేక్ పడింది. దాంతో బాలాజీ ప్రసాద్ కు సినిమాలపైనే ఆసక్తి పోయిందట. చూడ్డానికి అచ్చం రాజేంద్ర ప్రసాద్ లాగే కనిపించే బాలాజీ ప్రసాద్ ను ఎందరో తండ్రిలాగే ఉంటాడని..సినిమాల్లోకి వెళితే సక్సెస్ అవుతాడని చెప్పేవారట. కానీ బాలాజీ మాత్రం మొదటి సినిమా ఆగిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడట. 

అయితే రాజేంద్ర ప్రసాద్ మాత్రం తన కొడుకుని హీరోగానే చూడాలని కలలు కన్నట్టు తెలుస్తోంది. దానికోసం కుమారుడిని చాలా సార్లు రిక్వెస్ట్ కూడా చేశాడట. నిర్మాతలను సెట్ చేస్తానని..ఒకవేళ నిర్మాతలు ధోరక్కపోతే తానే నిర్మాతగా మారతానని సైతం హామీ ఇచ్చాడట. అయినప్పటికీ బాలాజీ ప్రసాద్ సినిమాలకు దూరంగా ఉంటూ తనకు ఇష్టమైన విదేశాలకు ఎక్స్ పోర్ట్ బిసినెస్ మెన్ గా వ్యవహరిస్తున్నారు.

More Related Stories