రౌడీ బేబీ షూటింగ్ ప్రారంభంSundeep Kishan
2020-12-16 13:08:35

సందీప్ కిషన్ హీరోగా ఎంవీవీ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా "రౌడీ బేబీ". ఈ సినిమా కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రొడక్షన్ లో వస్తోంది. సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తున్నారు. సినిమాకు నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. "రౌడీ బేబీ" పేరుతో సినిమా వస్తుండటంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఇక సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరొయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. నేహా శెట్టి మెహబూబ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. 

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక రౌడి బేబీ సినిమా పూర్తి లవ్ యాంగిల్ కథాంశం నేపథ్యంలో వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ నేడు వైజాగ్ లో ప్రారంభమయ్యింది. సినిమాలో  ప్రతి సన్నివేశాన్ని వైజాగ్ లొనే చిత్రిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. వైజాగ్ దాటి ఒక్క సీన్ కూడా తీయమని..వైజాగ్ లో సినీపరిశ్రమ అభివృద్ధి కోసమే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి వరకు పూర్తి చేసి మార్చ్ లేదా ఏప్రిల్ లో ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తామని ప్రకటించింది.

More Related Stories