పవన్ కళ్యాణ్ రానాల మలయాళ రీమేక్‌ మొదలైంది Pawan Kalyan Rana
2020-12-21 17:10:56

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.  ఇప్పుడు తెలుగులో బిజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనుండగా.. అతనికి ధీటుగా నిలిచే పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో  సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.దేవుని పటాలపై ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ స్క్రిప్ట్ ని దర్శకుడి చేతికి అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 12 గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. 

More Related Stories