సాయి ధరమ్ తేజ్ వర్సెస్ అల్లు శిరీష్.. పెళ్లి గోల..  Sai Dharam Tej
2020-12-23 02:50:37

మెగా కుటుంబంలో మొన్నే పెళ్లి బాజాలు మోగాయి. మళ్లీ త్వరలోనే మోగబోతున్నాయని వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఇంకా చాలా మంది కుర్రాళ్లు ఉన్నారు. పైగా అందరూ పెళ్లీడుకు వచ్చేసారు. దాంతో సాధారణంగా బయట ఆ వార్తలు అయితే వస్తూనే ఉంటాయి. అందులో అందరికంటే ముందు సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న కుర్రాళ్లలో ఆయనే పెద్దోడు కాబట్టి అందరూ సాయిని పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. మొన్న నిహారిక పెళ్లిలో కూడా సాయి పెళ్లి టాపిక్ వచ్చిందని మెగా వర్గాలే చెప్తున్నాయి. సాయి పెళ్లితో పాటు నిహారిక పెళ్లిలో మరొకరి గురించి కూడా మాట్లాడుకున్నారు. అతడే అల్లు శిరీష్. అల్లు వారబ్బాయిని కూడా బాగానే టార్గెట్ చేసారు మెగా బంధువులు. పెళ్లెప్పుడు అంటూ ఆయన్ని కూడా బాగానే అడిగినట్లు తెలుస్తుంది. మరి ఇంకేంటి.. ఎంచక్కా చేసుకోవచ్చుగా అనుకుంటున్నారా..? కానీ ఇక్కడ ఇద్దరికి ఇప్పుడు పెళ్లంటే పెద్దగా యిష్టం లేదు. కెరీర్ పైనే ఫోకస్ పెడుతూ దూసుకుపోతున్నారు. 

పెళ్లి టైమ్ వస్తే అదే అయిపోతుందిలే అనుకుంటున్నారు ఇద్దరూ. ఈ విషయంలో శిరీష్ క్లారిటీతో ఉన్నా కూడా సాయి ధరమ్ తేజ్ మాత్రం అనవసరంగా అల్లు వారబ్బాయిని పెళ్లి గోలలోకి లాగేసాడు. తన పెళ్లికి ఆయన పెళ్లిని ముడిపెట్టాడు. తన పెళ్లికి ఇంకా టైమ్ ఉందని చెప్తే పోయేదానికి అల్లు శిరీష్‌ను మధ్యలోకి తీసుకొచ్చాడు మెగా మేనల్లుడు. ముందు తానెందుకు చేసుకుంటాను.. తనకంటే వయసులో పెద్దోడు శిరీష్ ఉన్నాడుగా అడిగిన వాళ్లకు అందరికీ చెప్పేసాడు సాయి. కానీ అసలు నిజం ఏంటంటే సాయి ధరమ్ తేజ్ కంటే వయసులో అల్లు శిరీష్ వయసులో చిన్నోడు. కానీ తన కంటే పెద్దోడు అని చెప్పాడు సాయి తేజ్. మెగా మేనల్లుడు ఇలా చెప్పడానికి జెలసీ కారణం అని తెలుస్తుంది. 

ఎందుకంటే నిహారిక పెళ్లిలో పడింది బంధువులు అంతా కూడా సాయి ధరమ్ తేజ్ కళ్ల ముందే ఆయన కంటే చిన్నోడైన అల్లు శిరీష్‌ను పెళ్లి గురించి అడుగుతూ వచ్చారు. దానికి కారణం ఈ మధ్య బాగా రంగు తేలాడు శిరీష్. మొహంలో పెళ్లి కళ కూడా వచ్చిందంటూ ఆయన్నే అడిగేసరికి సాయి కాస్త చిన్నబుచ్చుకున్నాడని తెలుస్తుంది. అందుకే తన దగ్గరికి వచ్చినపుడు తనకంటే పెద్దోడు శిరీష్ ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ పై శిరీష్ కూడా రిప్లై ఇచ్చాడు. నా పెళ్లిపై సాయి ఏదో జోక్ చేసినట్లున్నాడు.. కానీ మీరే దాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు.. నేను సింగిల్‌గా ఉండటం నాకు చాలా సంతోషమే.. మా అమ్మానాన్నలు కూడా దీనిపై పెద్దగా ఆలోచించడం లేదు.. నాకు ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో అప్పుడే చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఏదేమైనా కూడా తన పెళ్లి గురించి సాయి అన్న మాటలను సీరియస్ చేయకుండా కామెడీగానే ముగించేసాడు ఈయన. ఏదేమైనా ఈ పెళ్లి గోల మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. 

More Related Stories