సామ్ జామ్ లో అల్లు అర్జున్ Allu Arjun
2020-12-24 10:56:47

హీరోయిన్ సమంత "ఆహా" ఓటీటీ లో సామ్ జామ్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో మొదటి అతిధి గా విజయ్ దేవరకొండ వచ్చాడు. ఆ తర్వాత రానా, తమన్నా, నాగ్ అశ్విన్, రకుల్ ప్రీత్ సింగ్, క్రిష్ ఈ షోలో మెరిసారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోలో పాల్గొన్నాడు. దాంతో సామ్ జామ్ కు మరింత క్రేజ్ పెరిగింది. కాగా ఈ సారి న్యూయర్ సందర్భంగా జనవరి 1న అల్లు అర్జున్ సామ్ జామ్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే సమంత తో బన్నీ ఇంటర్వ్యూ పూర్తికాగా న్యూయర్ కానుకగా ఈ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది. ఇదిలా ఉండగా అల్లుఅర్జున్ ప్రస్తుతం "పుష్ప" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా కనిపించనున్నాడు. లారీ డ్రైవర్ గా బన్నీ కానిపించనున్నడనీ టాక్ వినిపిస్తోంది.

More Related Stories