రెడ్ మూవీ ట్రైలర్ టాక్  RED Movie
2020-12-24 15:51:56

రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ''రెడ్'' లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో 'రెడ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు గురువారం ఈ చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ మంచి సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటూ, ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని – లైఫ్‌లో అంతా సాఫ్ట్ గానే అయిపోతుంద‌నుకున్న ఒక‌రి జీవితంలోకి, అచ్చంగా అలానే ఉన్న మ‌రో క్రిమిన‌ల్ ప్ర‌వేశిస్తే ఏం జ‌రుగుతుంద‌న్న‌ది క‌థ‌. ఇంట‌ర్ కూడా పాస‌వ్వ‌ని ఓ తెలివైన క్రిమిన‌ల్ గా రామ్ క‌నిపించ‌నున్నాడు. ఆ పాత్రే.. ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంద‌న్న విష‌యం ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మైపోతోంది. రామ్ గెట‌ప్‌, లుక్స్‌, డైలాగ్ డెలివ‌రీ… ఇవ‌న్నీ మాస్ కి న‌చ్చేలా ఉన్నాయి. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలానే పేర్చుకుంటూ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మ‌ణిశ‌ర్మ ఆర్‌.ఆర్‌.. ఈ సినిమాని మ‌రో స్థాయిలో తీసుకెళ్తుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగిస్తోంది.  'ఇస్మార్ట్ శంకర్' కి మించి ఇందులో రామ్ యాక్టింగ్ ఉండబోతోందని తెలుస్తోంది. 

More Related Stories