తండ్రీ కొడుకులతో కలిసి రొమాన్స్ చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్ళేTollywood Actresses
2020-12-31 01:57:03

అటు తండ్రి…ఇటు కొడుకు ఇద్దరితో కలిసి 21మంది యంగ్ హీరోయిన్ లు నటించారు. అంటే రెండు జెనెరేషన్స్ హీరోలతో ముద్దుగుమ్మలు రొమాన్స్ చేసారు. అలా కలిసి నటించిన వారిని చూస్తే కాజల్ రామ్ చరణ్ సరసన మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో నటించి...చెర్రీ తండ్రి మెగాస్టార్ తో ఖైదీ నంబర్ 150 సినిమాలో రొమాన్స్ చేసింది. అంతే కాకుండా మెగా ఫ్యామిలి హీరోల్లో అల్లు అర్జున్ తో ఆర్య 2, ఎవడు, పవన్ కళ్యాణ్ పక్కన సర్దార్ గబ్బర్సింగ్ సినిమాలో నటించింది.  

మిల్క్ బ్యూటీ తమన్నా రామ్ చరణ్ పక్కన రచ్చ సినిమాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక తండ్రి చిరంజీవితో  సైరా నరసింహారెడ్డి సినిమాలోను తమన్నా రచ్చ చేసింది. అంతే కాకుండా మెగా హీరోలు అల్లు అర్జున్ తో బద్రీనాథ్లో, పవన్ కళ్యాణ్ పక్కన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోనూ నటించి మెప్పించింది.  భూమిక నాగార్జున పక్కన స్నేహమంటే ఇదేరా సినిమాలో నటించింది. ఇక అదే ఫ్యామిలిలో యంగ్  హీరోలు సుమంత్ తో యువకుడులో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, సాంబ లో నటించిన భూమిక.. బాలకృష్ణ రూలర్ లోను నటించి మెప్పించింది.

అతిలోక సుందరి  శ్రీదేవి అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు సరసన  శ్రీరంగనీతులు సినిమాలో నటించి ఏఎన్ఆర్ కొడుకు  నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా సినిమాల్లో నటించింది.  శృతిహాసన్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు నటించి అలరించడమే కాకుండా పవన్ అల్లుడు అల్లు అర్జున్ పక్కన రేసుగుర్రం సినిమాలో, చరణ్ పక్కన ఎవడు సినిమాలోనూ స్క్రీన్ పై మెరిసింది. యంగ్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ నాగార్జున పక్కన  దేవదాస్ సినిమాలో నటించడమే కాకుండా సుమంత్ పక్కన  మళ్లీ రావా సినిమాలోనూ రొమాన్స్ చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న తాప్సీ రానా దగ్గుబాటి పక్కన ఘాజీ సినిమాలో నటించి మెప్పించడమే కాకుండా బాబాయ్ వెంకటేష్ సినిమా షాడోలో నటించింది. నయనతార జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో రొమాన్స్ చెయ్యడమే కాకుండా బాబాయ్ బాలయ్య పక్కన సింహ, శ్రీ రామ రాజ్యం, జై సింహ సినిమాల్లో అలరించింది. అంతే కాకుండా రానా దగ్గుబాటి పక్కన  కృష్ణం వందే గురుం సినిమాలో అలరించి వెంకటేష్  లక్ష్మి, తులసి, బాబు బంగారం సినిమాల్లో నటించింది.

యంగ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నాగ చైతన్య పక్కన రారండోయ్ వేడుక చూద్దాం లో నటించి తండ్రి నాగార్జున తో  మన్మధుడు 2 సినిమాలో రొమాన్స్ చేసింది. నటి  సదా జూనియర్ ఎన్టీఆర్ పక్కన నాగ సినిమాలో నటించి బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో రొమాన్స్ చేసింది.  ఇలియానా అల్లు అర్జున్ పక్కన జులాయి సినిమాలో నటించి పవన్ కళ్యాణ్ సరసన  జల్సా సినిమాలో రొమాన్స్ చేసింది. త్రిష జూనియర్ ఎన్టీఆర్ పక్కన దమ్ము సినిమాలో నటించి బాబాయ్ బాలకృష్ణ సరసన  లయన్ సినిమాలో నటించింది.

 శ్రీయ జూనియర్ ఎన్టీఆర్ పక్కన  నా అల్లుడు సినిమాలో నటించి బాబాయ్ బాలకృష్ణ పక్కన చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల్లో నటించింది.  అనుష్క రానా దగ్గుబాటి పక్కన రుద్రమదేవి సినిమాలో నటించడమే కాకుండా వెంకటేష్ పక్కన చింతకాయల రవి, నాగవల్లి సినిమాల్లో నటించింది. సుమంత్ పక్కన మహానంది సినిమాలో... నాగార్జునతో సూపర్, రగడ,డాన్, ఢమరుకం, కేడి, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాల్లో రొమాన్స్ చేసింది.

చబ్బీ బ్యూటీ ప్రియమణి జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ లో నటించి బాబాయ్  బాలకృష్ణ పక్కన మిత్రుడు, కళ్యాణ్ రామ్ హరే రామ్, సినిమాల్లో నటించింది. అంతే కాకుండా సుమంత్ పక్కన రాజ్, నాగార్జున పక్కన రగడ సినిమాల్లో రోమాన్స్ చేసింది. సమంత  అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో నటించి బాబాయ్ పవన్ కళ్యాణ్ పక్కన  అత్తారింటికి దారేది సినిమాలో అలరించింది.

ఆర్తి అగర్వాల్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన  అల్లరి రాముడు సినిమాలో నటించి బాలయ్య పక్కన పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమాలో రొమాన్స్ చేసింది. కళ్యాణ్ రామ్ పక్కన  విజయదశమి సినిమాలో నటించిన వేదిక బాలకృష్ణ పక్కన  రూలర్ సినిమాలో రొమాన్స్ చేసింది. జెనీలియా రానా దగ్గుబాటి సరసన నా ఇష్టం సినిమాలో నటించి వెంకటేష్ పక్కన సుభాష్ చంద్రబోస్ సినిమాలో నటించింది. యంగ్ బ్యూటీ సోనాల్ చౌహాన్   కళ్యాణ్ రామ్ షేర్ సినిమాతో పాటు బాబాయ్..బాలకృష్ణ సినిమాలైన లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో అలరించింది.

అయితే వీరిలో చాలామంది హీరోయిన్స్ ముందు తండ్రితో కలిసి నటించాక తర్వాత కొడుకుతో నటించారు. కానీ కాజల్, తమన్నా, రకుల్ మాత్రం ముందు కొడుకుతో కలిసి నటించక తర్వాత తండ్రితో కలిసి నటించారు.

More Related Stories