జాంబిరెడ్డి బిగ్ బైట్ రిలీజ్‌ చేయనున్న ప్రభాస్‌



Prabhas
2020-12-31 13:37:17

ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న జాంబీ రెడ్డి చిత్రంతో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల స‌మంత చేతుల మీదుగా విడుదలైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక న్యూయ‌ర్ గిఫ్ట్‌గా జ‌న‌వ‌రి 2న ప్ర‌భాస్ చేతుల మీదుగా బిగ్ బైట్ అంటూ ఓ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు మేక‌ర్స్ . తాజాగా దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భాస్ వంటి పాన్ ఇండియ‌న్ స్టార్ ఈ సినిమాకు స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో చిత్రంకు మంచి క్రేజ్ రావ‌డం ఖాయం. ప్రేక్షకుల ఊహకందని వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం  అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని అంటున్నారు చిత్ర నిర్మాత‌లు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావ‌డం గ‌మ‌నార్హం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ మూవీని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More Related Stories