యంగ్ హీరో సుధాకర్ జంటను అభినందించిన మెగాస్టార్Chiranjeevi meets Sudhakar
2021-01-04 14:47:34

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నటుడు సుధాకర్ కోమాకుల.. తన  సతీమణి హారిక తో  కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి మెగస్టార్ ఇంటికి వెళ్లారు. ఈ సంధర్భంగా  చిరంజీవి వారిని ఆశీర్వదించారు. అనంతరం ఆయన ‘ఇందువదన’  పాటని వైరల్ చేసినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ, అలాగే తన సపోర్ట్ ఎల్లపుడూ ఉంటుందని సుధాకర్ దంపతులకు చెప్పారు. 

దాంతో సుధాకర్ దంపతులు తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఇది  మిగిలిపోతుందని చెబుతూ సంతోషంలో ఉబ్బితబ్బిపోతున్నారు. ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉన్న కొత్త తరాన్ని నిస్స్వార్ధంగా ఉత్సాహపరిచే తన వ్యక్తిత్వాన్ని మెగాస్టార్ మరోసారి నిరూపించుకున్నారు. ఇదిలా ఉండగా సుధాకర్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాలో సుధాకర్ పాత్రకు, అతడి తెలంగాణ యాసకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరవాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఇటీవల మెగాస్టార్ పాటకు భార్యతో కలిసి స్టెప్పులేసిన సుధాకర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

More Related Stories