సమంతకు కౌంటర్లు వేసిన నాగ చైతన్య Samantha Naga Chaitanya
2021-01-04 17:19:41

సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'సామ్‌జామ్‌' షోకు నాగచైతన్య అతిథిగా వచ్చి అలరించాడు.  సెలబ్రిటీ జోడీగా పేరొందిన 'చైసామ్‌' చేసిన సందడి మాములుగా లేదు.  సమంత ప్రశ్నలకు నాగ చైతన్య  కౌంటర్లతో షో సందడిగా సాగిపోయింది. నా వంటకు ఎన్ని పాయింట్లు ఇస్తారని సమంత అడుగ్గా 'నువ్వు వంట చేస్తావా' అంటూ చై ఆశ్చర్యంగా ముఖం పెట్టారు. ఇది చూసిన షోలోని ప్రేక్షకులు గట్టిగా నవ్వేశారు. దీనికి తోడు జనవరి 8న ప్రసారం కాబోతున్న ఈ షో ప్రోమో వీడియో మరింత అట్రాక్ట్ చేస్తోంది. 'వీడు ఇంట్లోనే పడుంటాడు కాబట్టి లాస్ట్‌లో నన్ను పిలిచావ్' అంటూ సమంతకు నాగ చైతన్య పంచ్ విసరడం, అలాగే నా హస్బెండ్ మంచి మూడ్‌లో ఉన్నాడంటూ తనకు సంబంధించి కొన్ని విషయాలను సమంత అడగడం ఈ ప్రోమోలో హైలైట్ అవుతున్నాయి. సామ్‌జామ్‌ తొలి సీజన్‌కు ఇదే చివరి ఎపిసోడ్‌ కానుంది. ఇప్పటి వరకు మెగాస్టార్‌ చిరంజీవితో పాటు అల్లు అర్జున్‌, రకుల్‌, తమన్నా, రానా వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. జనవరి 8న ఆహాలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

More Related Stories