మారేడుమిల్లి అడవులకు మెగా హీరోస్Chiranjeevi Ram charan
2021-01-05 17:11:59

మెగా హీరోస్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు తూర్పుగోదావరి జిల్లాలోని మారేడ్ మిల్లి అడవులకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ "పుష్ప" సినిమా షూటింగ్ కొంతవరకు మారేడ్ మిల్లి అడవుల్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే నిహారిక పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. దాంతో మళ్ళీ షూటింగ్ కోసం మారేడ్ మిల్లి అడవులకు వెళ్లబోతున్నాడు. మరోవైపు మెగాస్టార్ నటిస్తున్న "ఆచార్య " సినిమాలో చరణ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే చరణ్-చిరు మధ్య కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా మారేడ్ మిల్లి అడవుల్లోనే ప్లాన్ చేశారట.

ఇక పుష్ప,ఆచార్య షూటింగ్ సెట్ లు పక్క పక్క నే ఉండటంతో ముగ్గురు హీరోలు ఒకేసారి మారేడ్ మిల్లి అడవులకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారట. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్లకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు చిరు నటిస్తున్న ఆచార్య సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
 

More Related Stories