పుష్పకు చెల్లెలిగా స్టార్ హీరోయిన్Allu Arjun
2021-01-06 14:54:05

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా...దేవి శ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ ఎప్పుడూ కనిపించని విధంగా కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. ఇప్పటి వరకు స్టయిలిష్ లుక్ లో కనిపించి అలరించిన బన్నీకి ఇది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. 

చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తుంది. ఇదిలా ఉండగా సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుండో సినిమాలో అల్లు అర్జున్ కు సోదరిగా మరో కీలక పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బన్నీకి సోదరిగా సాయి పల్లవి నటించనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన "విరాట పర్వం" సినిమాలో నటిస్తోంది. ఇక బన్నీకి చెల్లిగా నటిస్తుందా లేదా తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
   

More Related Stories