స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్Blood Donation Drive Camp
2021-01-09 12:46:50

దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ వర్థంతి  సంధర్భంగా ఈనెల 18న ఎన్టీఆర్ ట్రస్ట్ వారు "లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్" ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని సినిప్రముఖులు పిలుపునిచ్చారు. ఈమేరకు రూపొందించిన వీడియోలో దర్శకధీరుడు రాజమౌళి, హీరో అల్లరినరేశ్, విక్టరీ వెంకటేష్, తనికెళ్ళ భరణి, నటుడు రఘుబాబు, దర్శకుడు బోయపాటి శ్రీను, జగపతిబాబు, బ్రహ్మానందం లు రక్త దానం చేసి ప్రాణాలను కాపాడాలని అన్నారు.

 బ్రహ్మానందం మాట్లాడుతూ..అన్ని దానాలకన్నా రక్తం దానం మిన్న  అని ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలని కోరారు. దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ...ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న రక్తదానం శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలన్నారు. ఇదిలా ఉండగా 1997 లో ఎన్టీఆర్ గారి జ్ఞాపాకార్థం ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పేద వారికి సహాయం చేయడం ఈ ట్రస్ట్ ఉద్దేశ్యం. ఆర్థికంగా వెనుకబడిన వారికి, అనారోగ్య కారణాలతో బాధ పఫుతున్నవారికి, శరణార్ధుల ఈ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్నారు.

More Related Stories