మాస్టర్ రివ్యూMaster Movie Review
2021-01-13 22:56:26

విజయ్ కి తమిళ సూపర్ స్టార్ గా ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన సినిమాలతో విజయ్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. విజయ్ నటించిన కొత్త సినిమా "మాస్టర్" నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొట్టడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఎన్నో అంచనాల మధ్య ఈరోజు విడుదలైన "మాస్టర్ " ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :జేడీ (విజయ్) కాలేజీలో సైకాలజీ లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతడికి ఆ కాలేజీ యాజమాన్యం అంతా వ్యతిరేకంగా ఉన్న స్టూడెంట్స్ లో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈక్రమంలో కాలేజీలో స్టూడెంట్ ఎలెక్షన్స్ జరుగుతాయి. అయితే ఎన్నికల్లో ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నా జేడీ కాలేజీ నుండి వెళ్లిపోవాలని ప్రిన్సిపల్ ఒక షరతును పెడతాడు. ఎన్నికలు సజావుగానే జరిగినప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చాక మాత్రం ఒక పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో జేడీ కాలేజీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో జేడీ జువైనల్ అబ్జర్వేషన్ హోమ్ లో ఉపాధ్యాయుడిగా పని చేయడానికి వెళతాడు. అక్కడకు వెళ్ళాక పరిస్థితులు వేరేలా ఉంటాయి. జువైనల్ హోమ్ లోని బాలనేరస్థులను అడ్డుపెట్టుకుని భవాని (విజయ్ సేతు పతి) భయట నేరాలకు పాల్పడుతూ ఉంటారు. దాంతో భవాని ని ఎదుకునే పరిస్థితి జేడీ కి వస్తుంది. భవాని ని జేడీ ఎలా ఢీకొట్టాడు అన్నదే ఈ సినిమా కథ.

కథనం-విశ్లేషణ :ఈ సినిమా రొటీన్ గా హీరో ఎంట్రీతో కాకుండా విలన్ ఎంట్రీతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. విలన్ పాత్రను సినిమాలో హైలెట్ చేసారని చెప్పవచ్చు. అయితే హీరో మాత్రం విలన్ కు సరితూగేలా కనిపించకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. కాలేజీ స్టోరీ తో మొదలైన సినిమా అక్కడికి కట్ అయ్యి జువైనల్ హోమ్ కు సంబందించిన స్టోరీ మొదలవ్వగానే మరో సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సినిమాలో భవాని బాలనేరస్థుడిగా జువైనల్ హోమ్ కు వచ్చి చేరదీసిన వారినే హతమార్చడం అతడు విలన్ గా ఎదిగే క్రమం హైలెట్ అని చెప్పొచ్చు. విలన్ ఎలివేషన్ మొత్తం ఒక రేంజ్ లో ఉండేసరికి సినిమాపై అంచనాలు ఎక్కువవుతాయి. అయితే హీరో దగ్గరకు వచ్చేసరికి సినిమా రొటీన్ రూట్లోకి వెళ్ళిపోతుంది. హీరోలో మార్పు తీసుకువచ్చే ఇంటర్ వెల్ సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉన్న సినిమా సెకండ్ హాఫ్ లో అంత ఆసక్తిగా అనిపించదు. కథ ముందుకు సాగే కొద్దీ సినిమా పరిధి కుంచించుకు పోయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో విలన్ హీరోకు తెప్పించే అడ్డంకులు మాములుగా అనిపిస్తాయి. సినిమా చివర్లో హీరో విలన్ల మధ్య జరిగే పోరాట సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మాస్ సినిమాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అలరించవచ్చు...కానీ ఇప్పటికే రవితేజ పెట్టిన మాస్ బిర్యానీ తిన్న తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా పెద్దగా అలరించక పోవచ్చు.

నటీనటులు :విజయ్ తన అభిమానులని మెప్పించేలా నటించాడు. డ్యాన్స్ లు, ఫైట్ సన్నివేశాల్లో స్టైలిష్ లుక్ తో అలరించాడు. విజయ్ సేతుపతి సినిమాకు హైలెట్ గా నిలిచాడు. అతడిలో ఉన్న నటుడిని సేతుపతి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్క మాటలో సేతుపతి సినిమాను ప్రాణం పోసాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ మాళవిక మోహన్ సినిమాలో అందంగా కనిపించింది. తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

More Related Stories