ఉప్పెన టీజర్..అందమైన ప్రేమ కథా చిత్రం Uppena
2021-01-13 18:20:34

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా "ఉప్పెన" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నారు. సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన మంగుళూరు భామ కృతిశెట్టి నటించింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఉప్పెన భామకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. సినిమా విడుదల కాకుండానే క్రితి వెంట డైరెక్టర్ లు క్యూ కడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న "ఉప్పెన" టీజర్ నేడు విడుదలయింది. వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను భయటకు వదిలింది. ఈ టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో హీరోయిన్ రిచ్ కుటుంబం అని హీరో పూర్ ఫ్యామిలీ అని అర్థమయ్యింది. ఇద్దరి మధ్య వచ్చిన డైలాగ్ లు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. వైష్ణవ్ తేజ్ మీసాలు తిప్పుతూ విలేజ్ మాస్ కుర్రాడిలా..క్రితి శెట్టి పెద్దింటి అమ్మాయిలా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే సినిమాలో సాడ్ ఎండింగ్ కూడా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

More Related Stories