దిల్ రాజు జంటిల్మెన్..వరంగల్ శ్రీను జిఎస్టీ ఎగ్గొట్టాడు.. బెల్లంకొండ సురేష్Bellamkonda Suresh
2021-01-17 13:19:37

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో "అల్లుడు అదుర్స్" కూడా ఒకటి. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సినిమాలో బెల్లంకొండ శ్రీను పక్కన అనూ ఇమాన్యుయేల్, నబా నటేష్ హీరోయిన్ లుగా నటించారు. సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించారు. ప్రకాష్ రాజ్, సోనూ సూద్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా నిన్న "అల్లుడు అదుర్స్" సక్సెస్ మీట్ ను నిర్వహించారు. సక్సెస్ మీట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...సినిమా కమర్షియల్ విజయం సాధించిందని అన్నారు. 

కమర్షియలే కావాలని..డబ్బులే కావాలని వ్యాఖ్యానించారు. అల్లుడు అదుర్స్ సినిమా బడ్జెట్ 32 కోట్లని..సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కి 21 కోట్లు వచ్చాయన్నారు. మూడు రోజుల్లో సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయని తెలిపారు. మూడు రోజుల్లో సినిమా 10 కోట్లు వసూలు చేసిందన్నారు. సినిమా మొత్తం ఓవర్ యాక్షన్ గా ఉందని..ఓవరాక్షన్ తోనే సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పారు. 

ఈ సక్సెస్ మీట్ లో దిల్ రాజు, వరంగల్ శ్రీను మధ్య నెలకొన్న వివాదం పై బెల్లంకొండ సురేష్ స్పందించారు. దిల్ రాజు, శిరిష్ గురించి మాట్లాడే అర్హత వరంగల్ శ్రీనుకు లేదన్నారు. వారు ఇండస్ట్రీలో లేకపోతే నిర్మాతలే ఉందరన్నారు. వాళ్ళు అంతలా డబ్బు ఇస్తున్నారని చెప్పారు. తనకే కాకుండా దిల్ రాజు ఎంతో మందికి సహాయం చేశారన్నారు. తాను ఆరేళ్ళల్లో ఆరు సినిమాలు చేశానని..వాళ్ళు 100 సినిమాలు చేసారని చెప్పుకొచ్చారు.

More Related Stories