హైదరాబాద్ లో ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన సోనూ సూద్Sonu Sood
2021-01-19 21:43:49

లాక్ డౌన్ వేళ మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలను సోనూ సూద్ కొనసాగిస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ వేళ వలస కూలీలను సొంతూళ్లకు పంపించి సోనూసూద్ కలియుగ కర్ణుడి అవతరమెత్తారు. అంతే కాకుండా ఏపీలో ఒక రైతు కాడెద్దులు లేక కూతుళ్ళ సహాయంతో పొలం దున్నుతున్న వీడియోను సోషల్ మీడియాలో చూసిన సోనూ సాయంత్రానికల్లా ట్రాక్టర్ ను పంపించి వారికి అన్నగా మారాడు. సోనూ తన సొంత డబ్బులతో ఇప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. 

తాజాగా సోనూ సూద్ తన సొంత డబ్బులతో హైదరాబాద్ లో ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించాడు. ఈరోజు ట్యాంక్ బండ్ పై ఆయన అంబులెన్స్ కు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంతే కాకుండా  శవాల శివ అలియాస్ ట్యాంక్ బండ్ శివ సోనూసూద్ ను కలిశారు. శవాల శివ కూడా సోనూ సూద్ లాగే ట్యాంక్ బండ్ లో దూకిన వారి శవాలను భయటకు తీస్తూ ప్రజా సేవ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సోనూసూద్ సినిమాల విషయానికొస్తే సంక్రాంతికి విడుదలైన "అల్లుడు అదుర్స్" సినిమాలో నటించాడు. మరోవైపు సోనూసూద్ కు హీరోగా కూడా చాలా ఆఫర్లు వస్తున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

More Related Stories