మళ్లీ అడవుల బాట పడుతున్న పుష్పAllu Arjun
2021-02-01 19:02:36

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "పుష్ప". ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్ లలో అల్లు అర్జున్ చిప్పిరి జుట్టు మాసిన గడ్డంతో ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడూ అల్లు అర్జున్ ఇలాంటి పాత్రల్లో నటించలేదు. లవ్ రొమాంటిక్ యాంగిల్ లో మాత్రమే ప్రేక్షకులను అలరించాడు. 

దాంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ను అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే మారేడ్ పల్లి అడవుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని రాగా..కొన్ని రోజులు హైదరాబాద్ శివార్లలో సెట్ వేసి  చిత్రికరించారు. అయితే మళ్లీ ఈ సినిమా షూటింగ్ కోసం శ్రీశైలం అడవులకు వెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.  శ్రీశైలం అడవుల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట. అంతే కాకుండా ఒక పాటను కూడా షూట్ చేయనున్నారని సమాచారం. ఈ సాంగ్ షూట్ కోసం రష్మీక మందన కూడా శ్రీశైలం అడవులకు వెళ్లబోతుంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య -2 సూపర్ హిట్ కాగా "పుష్ప" కూడా హిట్ అవుతుందని అభిమానులు ధీమా తో ఉన్నారు.

More Related Stories